ETV Bharat / state

15 రోజుల్లోనే ముగ్గురు.. విషాదంలో కుటుంబం! - దుబ్బాక మున్సిపాలిటీ

దుబ్బాక ఏఎంసీ మాజీ ఛైర్మన్​ సిద్ధిరాములు సోదరుడైన నాగం రాజు రాజు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గత 15 రోజుల వ్యవధిలోనే కుటుంబంలో ముగ్గురు చనిపోవడం వారిని తీరని దుఖంలో ముంచింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రెండు వారాల వ్యవధిలోనే మృతి చెందడం వల్ల దుబ్బాక మున్సిపాలిటీలోని లచ్చపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Three Family Members Die With in 15 days Gap
15 రోజుల్లోనే ముగ్గురు.. విషాదంలో కుటుంబం!
author img

By

Published : Sep 14, 2020, 9:47 PM IST

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ ఏఎంసీ మాజీ ఛైర్మన్​ నాగ సిద్ధిరాములు సోదరుడి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో నివాసముండే ఆయన సోదరుడు నాగ రాజం కుటుంబంలో 15 రోజుల వ్యవధిలోనే ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. అనారోగ్యంతో రెండు వారాల క్రితం రాజం భార్య సరోనా చనిపోగా.. కుటుంబ సభ్యులంతా కలిసి దశదినకర్మ జరిపారు. అది ముగిసిన రెండు ముూడు రోజుల వ్యవధిలోనే.. పెద్ద కుమారుడు రమేశ్, చిన్న కుమారుడు సోమేశ్​ మృతి చెందగా.. నాగరాజును ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఒకే కుటుంబంలో అనారోగ్యంతో ముగ్గురు మృతి చెందడం వల్ల ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి మృతి పట్ల గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: శాసన మండలిలో రెవెన్యూ బిల్లుకు ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.