సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ చెల్లాపూర్ వార్డుకు చెందిన మట్ట బుచ్చి రెడ్డి అనే యువ రైతు ఇటీవల పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని భాజపా రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి పరామర్శించారు.
కుటుంబ సభ్యులకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు రాజిరెడ్డి, సుభాష్ రెడ్డి, కొండల్ రెడ్డి, వరదా రెడ్డి, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా?