సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చౌదర్ పల్లి గ్రామంలోని శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో, మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.
వివిధ ప్రాంతాల నుంచి హాజరైన భక్తులు శివయ్యను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి.