ETV Bharat / state

బయటకు వెళ్లవద్దన్న భార్య.. ఉరేసుకున్న భర్త - బయటకు వెళ్లవద్దన్న భార్య.. ఉరేసుకున్న భర్త

కరోనా మహమ్మారి వేళ బయట తిరగొద్దు.. రోజులు బాగాలేవు.. వైరస్‌ సోకితే ప్రాణాలు పోతాయని జాగ్రత్తలు చెప్పడమే భార్య తప్పయింది. ఆమె వ్యాఖ్యలకు మనస్తాపానికి గురైన భర్త బలవన్మరణానికి పాల్పడ్డారు.

The husband committed suicide because his wife told him not to leave the lock down at Siddipet
బయటకు వెళ్లవద్దన్న భార్య.. ఉరేసుకున్న భర్త
author img

By

Published : Apr 23, 2020, 3:17 PM IST

సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో భార్య మందలించిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన మంద రాములు కుమారుడు రాజుతో కలిసి గజ్వేల్‌లో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్‌ వల్ల దుకాణం మూతపడటంతో కుటుంబంతో కలిసి స్వగ్రామమైన లింగారెడ్డిపల్లికి చేరుకున్నాడు. గ్రామంలోనూ ఇంటిపట్టున ఉండకుండా రాములు బయట తిరుగుతూనే ఉన్నాడు. మంగళవారం గజ్వేల్‌కు కూడా వెళ్లి వచ్చాడు.

కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న తరుణంలో బయట ఎందుకు తిరుగుతున్నావంటూ భర్తను భార్య అంజమ్మ ప్రశ్నించింది. దీనివల్ల వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భార్య తనను ప్రశ్నించడమేంటని మనస్తాపం చెందిన రాములు బుధవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలోని మామిడి చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.