సిద్దిపేట జిల్లా లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీమరి నర్సింలు, కనకమ్మ దంపతులకు రేవంత్, లహరిక సంతానం. చిన్నారులు ఆడుకునేందుకు ఇంట్లో దూలానికి కొన్నిరోజుల క్రితం చీరతో ఊయల కట్టారు. రోజూమాదిరిగానే తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లారు.
బుధవారం సాయంత్రం రేవంత్(10) ఊయల ఎక్కి ఒక్కడే ఆడుకుంటున్నాడు. అదే సమయంలో గేదెలకు నీరు పెట్టేందుకు బాలుడి తాత లక్ష్మయ్య పొలం వద్ద నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఊయలకు రేవంత్ మృతదేహం వేలాడుతూ ఉండటాన్ని గమనించాడు. బోరున విలపిస్తూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఊయల నుంచి జారిపడటంతో బాలుడి మెడకు బిగుసుకొని ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎస్సై సాయిరాం చెప్పారు.
ఇదీ చదవండి: వేరే ఉపాధి చూసుకుంటున్న భవన నిర్మాణ కార్మికులు