సిద్దిపేట జిల్లా గజ్వెేల్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్ పల్లి పునరావాస కాలనీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా కలెక్టర్ వెంకటరామిరెెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా.. ములుగు గెస్ట్ హౌస్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ముట్రాజ్ పల్లి ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
వేగవంతం చేయండి..
జిల్లాలోని ముంపునకు గురయ్యే ఎనిమిది గ్రామాలు కలిస్తే ముట్రాజ్ పల్లి ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మితమైనట్లుగా కలెక్టర్ తెలిపారు. నిర్మాణంలో ఉన్న మొత్తం 6 వేల గృహాలను ఈ నెల చివరిలోపు పూర్తి చేసి గృహా ప్రవేశాలకు సిద్ధం చేయాలని ఇంజనీర్లను, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ఇళ్లు, వీధుల వారీగా నివేదికలు రూపొందించాలన్నారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. దీనిపై ప్రతి సోమవారం సమీక్షా, టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు అధికార యంత్రాంగానికి కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: సిద్దిపేటలో అర్బన్ పార్కును ప్రారంభించనున్న హరీశ్ రావు