సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో శంభుని గుట్టపై వెలసిన విద్యా సరస్వతి అమ్మవారి వసంత పంచమి వేడుక కోసం ఆలయం ముస్తాబయ్యింది. మాఘ శుద్ధ పంచమి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు మంచి విద్యాబుద్ధులు వస్తాయని తల్లిదండ్రులు విశ్వసిస్తారు. పిల్లలతో మొట్టమొదటి సారిగా అమ్మ వారి సమక్షంలో అక్షరాలు దిద్ధించాలని తల్లిదండ్రులు అధికంగా వర్గల్ సరస్వతి ఆలయానికి తరలివస్తారు.
ఉదయం నాలుగు గంటల నుంచే వర్గల్ విద్యాధరి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం తరలివస్తారని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్షరాభ్యాసాలు చేయించుకునే వారి కోసం రెండు అక్షరాభ్యాస మండపాలను సిద్ధం చేశారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: 'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్ పిటిషన్