విద్యార్థులు కేవలం పాస్ అవ్వడం కోసం కాదు.. ఉన్నత స్థాయికి ఎదగాలనే కాంక్షతో చదవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో పర్యటించిన హరీశ్.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు.
విద్యార్థులు కళాశాలకు రాకపోతే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని వందశాతం హాజరు ఉండేలా చూసుకోవాలని అధ్యాపకులను మంత్రి ఆదేశించారు. మధ్యాహ్న భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
విద్యార్థులకు ఎలాంటి అవసరాలున్నా... తన దృష్టికి తీసుకురావాలని అధ్యాపకులను హరీశ్ కోరారు. ఈ ఏడాది కచ్చితంగా వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు.