సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ పాఠశాల విద్యార్థులపై ఉన్న విశ్వసనీయత, ఉపాధ్యాయులపై ఉన్న నమ్మకమే ట్యాబ్‌లు అందజేయడానికి ముఖ్య కారణమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. బాలవికాస స్వచ్ఛంద సంస్థ సహకారంతో రూ.5 లక్షల విలువైన 40 ట్యాబ్‌లను పదో తరగతి విద్యార్థులకు మంత్రి అందజేశారు.
సహాయం అందిస్తే సద్వినియోగం చేసుకోవడం ఈ పాఠశాలను చూసే నేర్చుకోవాలని మంత్రి కొనియాడారు. మాటల్లో కాదు.. ఆచరణలో చిత్తశుద్ధితో పని చేసే పాఠశాల ఇందిరా నగర్ హైస్కూలు అని ప్రశంసించారు. విద్యతో పాటు సాంస్కృతిక, సంప్రదాయ, సామాజిక కార్యక్రమాలను, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించడం చాలా గొప్ప విషయమన్నారు.
మిగిలిన విద్యార్థులకు కూడా త్వరలో ట్యాబ్‌లు అందిస్తామని హామీ ఇచ్చారు. కరోనా ప్రభావం ఉన్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అన్నీ ఆన్‌లైన్‌లో బోధిస్తూ ఉండడం చాలా గొప్ప విషయమన్నారు. పాఠశాలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందించి, మంచి వాతావరణంలో పాఠాలు బోధించేందుకు కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: అలా చేస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం వస్తుంది: వీహెచ్