ప్రధాని మోదీ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర అధిష్ఠానం పిలుపుపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పట్టణ మహిళా మోర్చ అధ్యక్షురాలు తిరుమల అన్నారు. పట్టణంలోని పదో వార్డులో భాజపా పట్టణ శాఖ, మహిళా మోర్చ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని... ఆ ఉద్దేశంతోనే ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు.
![హుస్నాబాద్ పట్టణంలో భాజపా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-101-20-bjp-svachabharath-avb-ts10085_20092020125036_2009f_1600586436_48.jpg)
పట్టణంలోని ప్రతి వార్డులో... ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని... వారి వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: మరో ఘనతను సాధించిన శంషాబాద్ విమానాశ్రయం