ETV Bharat / state

పోలింగ్​ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు నిఘానేత్రాలు - దుబ్బాక ఎన్నికలకు సీసీ కెమెరాలు

దుబ్బాక ఉప ఎన్నికల్లో పోలింగ్‌ ప్రక్రియపై ఎన్నికల సంఘం సాంకేతిక నిఘా పెట్టనుంది. మూడు రూపాల్లో ఈ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు. పోలింగ్‌ ప్రారంభం నుంచి ముగిసే వరకు ఏదో ఒక రూపంలో చిత్రీకరణ జరగనుంది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి చేపట్టనున్న చర్యలపై ప్రత్యేక కథనం

Surveillance to focus specifically on polling stations at dubbaka
పోలింగ్​ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు నిఘానేత్రాలు
author img

By

Published : Oct 27, 2020, 4:40 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో నవంబరు 3న పోలింగ్‌ జరగనుంది. 1.98 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 315 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇలాంటి పరిస్థితిలో పోలింగ్‌ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు లేకుండా, పారదర్శకంగా చేపట్టాల్సిన బాధ్యత అధికారులకు ఏర్పడింది. ఈ మేరకు వివిధ రూపాల్లో పోలింగ్‌ కేంద్రాలపై సాంకేతిక నిఘాకు సిద్ధమవుతున్నారు.

70 చోట్ల వెబ్‌కాస్టింగ్‌

నియోజకవర్గంలో 70 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేపట్టనున్నారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు, ఎంపిక చేసిన యువతకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ల్యాప్‌టాప్‌, వెబ్‌కెమెరాల ద్వారా కేంద్రాల్లో దీన్ని చేపట్టనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ అంతర్జాల వ్యవస్థ ద్వారా ఈ కేంద్రాలను కలెక్టరేట్‌లోని వెబ్‌కాస్టింగ్‌ పరిశీలన కేంద్రం, హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌, దిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి అనుసంధానించనున్నారు. 70 కేంద్రాల్లో పోలింగ్‌ను ఈ మూడు చోట్లతెరలపై ఎన్నికల అధికారులు పరిశీలించే అవకాశం ఉంది.

  • 113 పోలింగ్‌ కేంద్రాల్లో మానవ రహిత కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా కేంద్రాల్లోని పోలింగ్‌ ప్రక్రియ తీరుతెన్నులు వీడియో రూపంలో ఈ కెమెరాల్లో నిక్షిప్తం కానున్నాయి.
  • మరో 132 కేంద్రాల్లో కెమెరామెన్ల ద్వారా వీడియో చిత్రీకరణ చేయనున్నారు. వీలైతే వీటిలో కొన్నింట మానవ రహిత కెమెరాలు పెట్టడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
  • మొత్తం మీద వచ్చే నెల 3న పోలింగ్‌ కేంద్రాలన్నింటిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియపై సాంకేతిక కన్ను పెట్టనున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, కేంద్రాల్లో ఏజెంట్లు ఓటర్లను ప్రభావితం చేయకుండా పారదర్శంగా ఓటింగ్‌ చేపట్టేందుకు ఇది ఉపయుక్తంగా మారనుంది.

పోలింగ్‌ కేంద్రాలకు జియో ట్యాగింగ్‌

పోలీస్‌శాఖ కూడా సాంకేతిక అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇప్పటికే 315 కేంద్రాలను ఆక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఉపగ్రహం సహాయంతో జియో ట్యాగింగ్‌ చేశారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ గదికి వీటిని అనుసంధానం చేశారు. ఏ కేంద్రంలోనైనా రద్దీ ఏర్పడ్డా, సమూహాలు ఒక్క చోట చేరినా, భారీగా వాహనాలు వచ్చినా జియో ట్యాగింగ్‌ వ్యవస్థ ద్వారా కంట్రోల్‌ గదిలోని తెరపై ఎరుపు రంగు చుక్క రూపంలో సమాచారం అందుతుంది. దీంతో ఆ ప్రాంతానికి వెంటనే అదనపు పోలీస్‌ బలగాలు చేరుకునే అవకాశం ఉంది.

నియోజకవర్గంలో ఇలా..

  • పోలింగ్‌ కేంద్రాలు: 315
  • సాధారణ కేంద్రాలు: 226
  • సమస్యాత్మక/ అతి సమస్యాత్మక కేంద్రాలు: 89

ఇదీ చదవండిః పోలీసులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్సీ రాంచందర్ రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.