రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సొమ్ము చెల్లించడం కోసం రూ.26 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై సిద్దిపేట జిల్లాలోని క్షేత్రస్థాయి బాధ్యులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ధాన్యం కొన్న 24 గంటల్లో డబ్బు జమ చేయడం కోసం సీఎం కేసీఆర్ నగదును సిద్ధంగా ఉంచారన్నారు.
మిల్లులో ధాన్యం దించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని... అది పూర్తైన 24 గంటల్లోపు నగదు జమచేయాలని సూచించారు. టార్ఫలిన్, గన్ని బ్యాగుల కొరత, రవాణా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు, చెల్లింపుల్లో ఆలస్యమైతే ఆ బాధ్యత కొనుగోలు కేంద్రం ఇంఛార్జీదేనని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, అదనపు కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి: సీఎస్