ETV Bharat / state

వెయ్యి డప్పులు, లక్ష గొంతులు: గద్దర్ - వెయ్యి డప్పులు, లక్షగొంతులు

జర్నలిస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత స్థానం ఇవ్వాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా వెయ్యి డప్పులు, లక్ష గొంతులు అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు.

singer gaddar press meet on awareness program
వెయ్యి డప్పులు, లక్ష గొంతులు: గద్దర్
author img

By

Published : Apr 15, 2021, 10:00 AM IST

సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్​లో ప్రజాగాయకుడు గద్దర్ పాత్రికేయులతో సమావేశమయ్యారు. పత్రికా రంగంలో ఉన్న అక్షర శిల్పులైన జర్నలిస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత స్థానం ఇవ్వాలని గద్దర్ డిమాండ్ చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా వెయ్యిడప్పులు, లక్ష గొంతులు అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా సంవత్సర కాలం తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో పాదయాత్ర చేయనున్నట్లు స్పష్టం చేశారు. సంవత్సర కాలంలో లక్షలాది మంది కవులు, కళాకారుల సమ్మేళనం నిర్వహించి వారి భావజాలాన్ని ఒక నివేదికగా రూపొందించి కేంద్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంబంధిత సాంస్కృతిక శాఖ మంత్రులకు సమర్పిస్తానని పేర్కొన్నారు. దేశ జనాభాలో 15% ఉన్న నిమ్న బలహీనవర్గాల ప్రజలు తాము ఒక ప్రత్యేక జాతిగా ఏర్పడాలని, అందుకు అంకురార్పణగా... పేరు చివరన గద్దర్ (యు-ఆన్ టచబుల్) అని నామకరణం చేసుకుంటున్నట్లు వెల్లడించారు.

వెయ్యి డప్పులు, లక్ష గొంతులు: గద్దర్

ఇదీ చూడండి: కొవిడ్‌తో ఉన్నతాధికారులు, ఉద్యోగులు సతమతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.