ETV Bharat / state

ఎడతెరిపిలేని వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు - సిద్దిపేట జిల్లా వార్తలు

సిద్దిపేట పట్టణంలో వరద నీటితో పంటలు నీట మునిగి రోడ్లు జలమయమయ్యాయి. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ఇళ్లు నేలకూలి ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు.

siddipet rains.. many problems for people
ఎడతెరిపిలేని వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు
author img

By

Published : Oct 14, 2020, 12:22 PM IST

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట జిల్లాలోని పత్తి, వరి చేలు నీట మునిగాయి. చెరువులు, చెక్​డ్యాంలు నిండుకుండలా మారాయి. చిన్నకోడూరు, నంగనూరు, నారాయణరావుపేట మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది.

పలు చోట్ల పాత ఇళ్లు నేల కూలాయి. చేతికొచ్చిన పంట వర్షాల వల్ల పాడైపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు పూర్తిగా నీట మునగడం వల్ల చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోనూ చెరువులు, కుంటలు నిండి పొంగిపొర్లుతున్నాయి. రామసముద్రం మత్తడి దూకగా నీళ్లు రహదారిపైకి చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి: కీసర తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.