ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సిద్దిపేట జిల్లా భాజపా అధ్యక్షుడు నరోత్తం రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లోని పరిస్థితులను రైతులను అడిగి తెలుసుకున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో తేమ, తాలు పేరుతో రైతులను నిర్వాహకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. దీంతో ప్రతి రైతు ఒక ఎకరాకు మూడు నుంచి నాలుగు వేల వరకు నష్టపోతున్నారని అన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రైతులకు నష్టం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 'రవాణా రంగ కార్మికులకు ఆర్థికసాయం చేయాలి'