కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న 12 లక్షల మంది రవాణా రంగ కార్మికులకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని సీఐటీయూ కార్మికులు కరీంనగర్లో నిరసన చేశారు. ఉపాధి లేక కార్మికుల కుటుంబాలు ఆకలి చావులు అనుభవిస్తున్నారని జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ తెలిపారు.
కార్మికులకు నెలకు రూ.7500 ఆర్థికసాయాన్ని 3 నెలలపాటు అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ అప్పులపై 6 నెలల పాటు మారిటోరియం విధించాలని సూచించారు. కరోనా సాకుతో డ్రైవర్స్‌ను తొలగిస్తున్న ప్రైవేట్ యాజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా ఉప రవాణా శాఖ అధికారి పుప్పాల శ్రీనివాస్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.