ETV Bharat / state

'అక్కన్నపేట కాల్పుల్లో వాడిన ఏకే-47 పోలీసులదే'

సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేటలో గంగరాజుపై సదానందం కాల్పులు జరిపిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ తుపాకులు పోలీసులవేనని ఇంఛార్జ్‌ సీపీ శ్వేత నిర్ధారించారు. ఒక ఏకే-47తో పాటు కార్బైన్ తుపాకులను అపహరించినట్లు వెల్లడించారు.

siddipet-cp-responds-to-gun-firing-incident-says-the-guns-belong-to-police
ఆ ఏకే 47 గన్​ పోలీసులదే:​ సీపీ
author img

By

Published : Feb 19, 2020, 8:46 AM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పోలీసుస్టేషన్‌లో ఆయుధాల చోరీ ఘటనను అధికారులు ఎట్టకేలకు నిర్ధారించారు. అప్పటి పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించేందుకు సిద్ధమవుతున్నారు. సిద్దిపేట సీపీ కార్యాలయంలో ఆ వివరాలను ఇన్‌ఛార్జి సీపీ శ్వేత మంగళవారం వెల్లడించారు.

ఆ ఏకే 47 గన్​ పోలీసులదే:​ సీపీ

ఈ నెల 6న అక్కన్నపేటలో దేవుని సదానందం అదే గ్రామానికి చెందిన గంగరాజు లక్ష్యంగా ఏకే-47తో కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. సదానందం హుస్నాబాద్‌ ఠాణా నుంచి ఆయుధాలను ఎలా ఎత్తుకెళ్లాడు.. అప్పట్లో విధుల్లో ఉన్న పోలీసులు ఎవరు.. నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఎంతమంది అనే దిశగా వారం రోజులు విచారణ చేపట్టారు.

తన భార్య కేసుతోపాటు, కొమురవ్వ అనే మహిళకు అప్పు వివాదానికి సంబంధించి సదానందం తరచూ హుస్నాబాద్‌ ఠాణాకు వచ్చేవాడు. ఈ క్రమంలోనే ఠాణా నుంచి ఏకే-47, కార్బైన్‌ ఆయుధాలు, 30 తూటాలు దొంగిలించినట్లు తేల్చారు. నిందితుడితో పాటు అప్పట్లో విధుల్లో ఉన్న పోలీసులను విచారించిన అధికారులు బాధ్యులను గుర్తించారు. ఈ వ్యవహారంలో ఐదుగురు పోలీసులు నిర్లక్ష్యం వహించినట్లు అధికారులు గుర్తించారని సమాచారం. వారిపై చర్యలు తీసుకోవాలని త్వరలో ఉన్నతాధికారులను కోరనున్నట్లు తెలిసింది. మరోవైపు అప్పటి అధికారుల నిర్లక్ష్యంపై నివేదికను త్వరలో ఉన్నతాధికారులకు పంపిస్తామని ఇన్‌ఛార్జి సీపీ శ్వేత తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.