ETV Bharat / state

'కరోనాతో ఇళ్ల నిర్మాణం ఆలస్యమైంది... 90 రోజుల్లో పూర్తిచేస్తాం' - Mallana Sagar

మల్లన్న సాగర్ ముంపు భాదితుల కోసం సిద్దిపేట జిల్లా గజ్వేల్​ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్​పల్లి శివారులో నిర్మిస్తున్న పునరావాస కాలనీ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Siddipet Collector Venkat Ramreddy Review Meeting
మల్లన్న సాగర్​ బాధితులకు పునరావాసంపై కలెక్టర్​ సమీక్ష
author img

By

Published : Jun 23, 2020, 8:56 PM IST

ముట్రాజ్​పల్లి శివారులో మల్లన్న సాగర్​ ముంపు బాధితుల కోసం నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఏజెన్సీలతో చర్చించారు. కరోనా నేపథ్యంలో 4 నెలలు నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయని, విడతల వారీగా 60 నుచి 90 రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.

దాదాపు 1500 ఇళ్లు పూర్తయితే.. ముంపు గ్రామస్తులను ఇళ్లకు చేరవేయవచ్చనే అంశాలపై అధికారులు, ఏజెన్సీలతో మాట్లాడారు. కరోనా దృష్ట్యా పనులు ఆలస్యమైనందున ముట్రాజ్ పల్లి ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణంలో కాంట్రాక్టర్ల వద్ద ప్రస్తుతం 600 మంది కార్మికులు ఉన్నారని, పనులు వేగవంతం చేసేందుకు ఒక్కో ఏజెన్సీ అదనంగా 500 మంది కార్మికులను అత్యవసరంగా తెప్పించుకుని పనులు చేయించాలని కలెక్టర్​ ఆదేశించారు.

కార్మికులను రప్పించడానికి రైలుకైతే రూ.1400, విమానం రూ.4500 రూపాయలు టిక్కెట్టు ధర ఉన్నదని, రెండింటి వ్యత్యాసం రూ.3 వేలుగా ఉందని, కనీసంగా 3 వేల మంది కార్మికులను అత్యవసరంగా విమానంలో తీసుకొచ్చి పనులు వేగవంతం చేయాలని సూచించారు. విమాన చార్జీలు కాంట్రాక్టర్లే భరించాలని కలెక్టర్ ఆదేశించారు. జూలై నెల 2వ తేదిన తిరిగి సమీక్షా సమావేశం ఉంటుందని, అప్పటి వరకు దాదాపు రెండువేల కార్మికులను రప్పించాలని ఆదేశించారు.

ఇందుకు గానూ.. జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం, ఏజెన్సీలకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ముట్రాజ్​పల్లి, లింగరాజు పల్లిలో అసైన్డుదారులు, స్థల ఆక్రమితదారులు ప్రభుత్వ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి కోరారు. ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణంతో 4800 కుటుంబాలకు ఆవాసం కల్పిస్తున్న దృష్ట్యా భూ సేకరణకు సహకారం ఇవ్వాలని సూచించారు. పట్టాభూమి అయినా, ప్రభుత్వ భూమి అయినా భూమిని ఆక్రమించుకున్న వ్యక్తులలో అర్హత కలిగి ఉన్న వారికి ప్రభుత్వం నష్ట పరిహారం అందిస్తుందని, అర్హత లేని వారి భూములను ప్రభుత్వం తీసుకుంటుదని కలెక్టర్ తెలిపారు.

చట్ట ప్రకారంగా భూసేకరణ ప్రక్రియను చేపట్టి త్వరగా పూర్తి చేయాలని ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, తహశీల్దారు అన్వర్​లను కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష పంచాయతీరాజ్ ఎస్ఈ కనకరత్నం, పీఆర్ అధికారులు వేణు, రామచంద్రం పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కర్నల్​ సంతోష్​బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.