సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని సుమారు 160 మంది జర్నలిస్టుల కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి వంటి ఈ విపత్కర పరిస్థితుల్లో.. రేయింబవళ్లు వార్తలను సేకరిస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్న జర్నలిస్టుల కుటుంబాలకు తనవంతు సహాయంగా సరుకులు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం'