సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలను కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. హస్తం పార్టీ నేతలు రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అతి పిన్న వయస్సులోనే రాజీవ్‌గాంధీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినా.. ఆయన చేపట్టిన సంస్కరణలు చరిత్రలో నిలిచిపోతున్నాయన్నారు.
యువతకి 18 ఏళ్ల ఓటు హక్కు కలిపించడం, శాస్త్ర, సాంకేతిక రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు చేపట్టడం రాజీవ్‌గాంధీకే దక్కిందని డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి అన్నారు. రాజీవ్ గాంధీ కుటుంబం దేశ సేవకు అంకితమయ్యిందని.. వారి మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్ సూచనలు