ETV Bharat / state

కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్​ రావు - దుబ్బాక ఉపఎన్నికలో రఘునందన్​ రావు గెలుపు వార్తలు

భాజపాలో కీలక నేత... క్యాడర్​కు సదా అందుబాటులో ఉంటాడనే పేరు... రెండు సార్లు ఓటమి పాలైనా పోరాటం ఆపలేదు. చివరకు మూడోసారి విజయం సాధించి.. దుబ్బాక పీఠం కైవసం చేసుకున్నారు మాధవనేని రఘునందన్ రావు. ఐపీఎల్ మ్యాచ్​ తరహాలో ఉత్కంఠగా సాగిన ఓటింగ్​లో అధికార పార్టీపై స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. తెరాస జోరు, కాంగ్రెస్ నుంచి పోటీని దీటుగా ఎదుర్కొని విజయభేరీ మోగించారు.

raghunandan rao won in dubbaka by election in siddiepeta district
కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్​ రావు
author img

By

Published : Nov 10, 2020, 3:57 PM IST

Updated : Nov 10, 2020, 4:23 PM IST

రఘునందన్​ రావు తెరాసతో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి భాజపాలో కీలక నేతగా మారారు. చిన్నతనం నుంచి రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్​ఎల్​బీ పట్టా పొందారు. తెరాసలో సామాన్య కర్యకర్తగా ప్రారంభమైన మాధవనేని రఘునందన్​ రావు జీవితం.. భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యే స్థాయి వరకు వెళ్లింది.

హైకోర్టు బార్​ అసోసియేషన్‌లో న్యాయవాదిగా

ఉమ్మడి మెదక్​ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లాలో రఘునందన్​ రావు జన్మించారు. తండ్రి పేరు భగవంతరావు. సిద్దిపేటలో బీఎస్సీ చేసిన రఘనందన్​ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్​.ఎల్​.బీ పూర్తి చేశారు. అనంతరం ఓ ప్రముఖ పత్రికలో విలేకరిగా పని చేశారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బార్​ అసోసియేషన్‌లో న్యాయవాదిగా చేరారు.

రెండుసార్లు ఓటమి

తెరాస ప్రారంభం నుంచి రఘునందన్​ రావు పార్టీలో కీలకంగా పని చేశారు. పొలిట్‌బ్యూరో సభ్యులుగా, మెదక్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. 2013లో గులాబీ పార్టీ నుంచి సస్పెండైన రఘు.. భాజపాలో చేరారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దుబ్బాక శాసనసభ్యుడు రామలింగారెడ్డి మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో విజయం సాధించారు.

ఇదీ చదవండి: దుబ్బాకలో ఓట్ల లెక్కింపు పూర్తి.. భాజపా విజయం

Last Updated : Nov 10, 2020, 4:23 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.