ETV Bharat / state

దుబ్బాక రైతులపై వివక్ష ఎందుకు..?: రఘునందన్​రావు

మల్లన్న సాగర్ కాలువల నిర్మాణంలో భూములు కోల్పోతున్న దుబ్బాక రైతులకు సిద్దిపేట, గజ్వేల్​ రైతులకు చెల్లించిన మాదిరిగా పరిహారం అందించాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందర్​రావు డిమాండ్​ చేశారు. సిద్దిపేట జిల్లా కమ్మర్​పల్లిలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.

Raghunandan Rao unfurling the party flag at Kamar Palli
దుబ్బాక రైతులపై వివక్ష ఎందుకు..?: రఘునందన్​రావు
author img

By

Published : Aug 31, 2020, 9:03 AM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మర్​పల్లిలో భారతీయ జనతా పార్టీ జెండాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్​రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 50 మంది యువకులు రఘునందన్​రావు సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం రాబోయే దుబ్బాక ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Raghunandan Rao unfurling the party flag at Kamar Palli
దుబ్బాక రైతులపై వివక్ష ఎందుకు..?: రఘునందన్​రావు

మల్లన్న సాగర్ కాలువల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు దుబ్బాకలో ఒక రకంగా, సిద్దిపేటలో ఒక రకంగా, గజ్వేల్​లో మరో రకంగా పరిహారం చెల్లిస్తున్నారని రఘునందన్​రావు ఆరోపించారు. పరిహారం విషయంలో దుబ్బాక రైతులపై వివక్ష ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ నియోజక వర్గంలో ఎకరానికి రూ.20 లక్షలు, మంత్రి హారీశ్​రావు నియోజక వర్గంలో రూ.15 లక్షలు ఇచ్చి.. దుబ్బాక నియోజకవర్గంలో ఎకరానికి రూ.6 లక్షల పరిహారం ఇస్తారా అంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో దుబ్బాక భాజపా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి.. 'కరోనా వైరస్‌ మళ్లీ తిరగబెట్టవచ్చు... అప్రమత్తత అవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.