సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ఓ రైతు.. తన పొద్దు తిరుగుడు పంటను పక్షుల బెడద నుంచి తప్పించడానికి వినూత్నంగా ఆలోచించాడు. పూలలో ఉండే గింజలను పక్షులు తినకుండా వాటికి కవర్లు చుట్టి ఉంచాడు. పంటకు నష్టం జరగకుండా కాపాడుకుంటున్నాడు.
పట్టణానికి చెందిన బత్తుల రవీందర్.. శివారులోని 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పంటను సాగు చేశాడు. సాధారణంగా పొద్దు తిరుగుడుకు పక్షుల బెడద ఎక్కువగా ఉంటుంది. పూలలో విత్తనాలు తయారయ్యే లోపు పక్షులు వాలి వాటిని తినేస్తుంటాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో పంటను కాపాడుకునేందుకు ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించినట్లు రవీందర్ తెలిపారు.
కవర్లు గాలికి కదిలినప్పుడు మెరుస్తూ ఉండడంతో పక్షులు అటువైపు రావడానికి జంకుతున్నాయి. కొంత వరకైతే పంటను రక్షించుకోగలుగుతున్నాను. పంట చేను ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో.. అటువైపుగా వెళ్లే వాహన దారులు ఆసక్తిగా చూస్తున్నారు.
- రైతు రవీందర్
ఇదీ చదవండి: రేపటి నుంచి తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టు సేవలు నిలిపివేత