పాఠశాలలు మూసి వేయడంతో తమకు ఉపాధి లేక దిక్కు తోచని స్థితిలో ఉన్నామని... ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను వెంటనే తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ... సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పాఠశాల విద్యను, ప్రైవేట్ ఉపాధ్యాయులను కాపాడాలని పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
పొరుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరిచే ఉన్నాయన్నారు. మద్యం దుకాణాలు తెరిచి ఉండడం వల్ల కరోనా రావడం లేదా అని ప్రశ్నించారు. కేవలం గురుకుల విద్యాలయాల్లోనే కరోనా కేసులు నమోదయ్యాయని అన్నారు. డే స్కాలర్ పాఠశాలలు యథావిధిగా నిర్వహించాలని కోరారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి పాఠశాలలు తెరిపించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: సిరిపూర్‌లో లాక్డౌన్ విధిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మానం