ETV Bharat / state

'భారీ వర్షంతో చెరువుల్లో జలకళ'

సిద్దిపేట జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు మండలాల్లోని చెరువులు జలకళ సంతరించుకున్నాయి.

'భారీ వర్షంతో చెరువుల్లో జలకళ'
author img

By

Published : Oct 12, 2019, 4:58 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు మండలాల్లోని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. హుస్నాబాద్ మండలంలో 76.4 మి.మీ వర్షపాతం నమోదైంది. మండలంలోని పందిళ్ళ, పొట్లపల్లి, మీర్జాపూర్ ఊరి చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. వర్షంతో పలు గ్రామాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు నేలకొరిగాయి. మరోవైపు ఈ భారీ వర్షంతో రెండో పంటకూ నీళ్లందుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

'భారీ వర్షంతో చెరువుల్లో జలకళ'

ఇదీ చూడండి : అధిక ఛార్జీలకు చెక్​... నేటి నుంచి అద్దె బస్సులోనూ టికెట్లు!

Intro:TG_KRN_101_12_BHARI VARSHAM_CHERUVULLO JALAKALA_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
--------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. నియోజకవర్గంలోని పలు మండలాల్లోని చెరువుల్లో జలకళ సంతరించుకుంది. హుస్నాబాద్ మండలంలో 76.4 మీ.మీ వర్షపాతం నమోదయింది, మండలంలోని కొత్త చెరువుకు మత్తడి పడి కిందకి అలుగుపారుతోంది. మండలంలోని పందిళ్ళ, పొట్లపల్లి, మీర్జాపూర్ ఊర చెరువులలో జలకళ సంతరించుకుంది. పొట్లపల్లి వాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యామ్ నిర్మాణ సామాగ్రి వాగు వరద దాటికి కొట్టుకుపోయింది. మండలంలోని పలు గ్రామాలలో కొన్ని ఎకరాలలో వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి, పత్తి పంట నీట మునిగి రైతులకు నష్టం వాటిల్లింది. పలుచోట్ల వరద నీటిలో కొట్టుకు వస్తున్న చేపలను పట్టుకుంటూ కొంతమంది జాలర్లు ఆహ్లాదానికీ గురయ్యారు. పోతారం( ఎస్) గ్రామంలోని ఓ అనాధ వృద్ధురాలి గ్రహం భారీ వర్షం ధాటికి కూలిపోయింది. ముసలమ్మ అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. హుస్నాబాద్ భూగర్భజలప్రదాయని బైరన్ చెరువులో జలకళ సంతరించుకొంది. మొత్తానికి రెండు గంటలపాటు కురిసిన వర్షంతో ఇన్ని రోజులు నీరు లేక వట్టిపోయిన కుంటలు, చెరువులు, వాగులు జలకళ సంతరించుకున్నాయి. ఓ వైపు రెండో పంటకు కూడా నీళ్లు అందుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ డివిజన్ లోని కోహెడ మండలంలో కూడా 28.6 మీ.మీ వర్షపాతం నమోదయింది.

Body:బైట్స్

1) ప్రభాకర్ రెడ్డి హుస్నాబాద్ మండల రైతు
2) బత్తిని సాయిలు, పోతారం (ఎస్) గ్రామ సర్పంచ్

Conclusion:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో భారీ వర్షం, చెరువుల్లో జలకళ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.