ETV Bharat / state

విషపుకేకు ఘటనలో విచారణ వేగవంతం

పుట్టిన రోజు వేడుకలో విషపూరిత కేకుతిని తండ్రి కొడుకు మృతిచెందిన కేసులో విచారణ వేగంగా జరుగుతోంది. తీవ్రఅస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి, తల్లి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. నిందితుడిని న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు పోలీసులు పకడ్బందీగా విచారణ చేస్తున్నారు.

విషపుకేకు ఘటనలో విచారణ వేగవంతం
author img

By

Published : Sep 8, 2019, 12:04 AM IST

సిద్దిపేట జిల్లా ఐనాపూర్​లో విషపూరిత కేకుతిని తండ్రీకొడుకు మృతిచెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిపాలైన చిన్నారి పూజిత గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. తల్లి భాగ్యలక్ష్మి సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో ఉంది. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. మిస్టరీగా మారిన ఈ కేసును హుస్నాబాద్​ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దోషులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.

అన్ని కోణాల్లోనూ దర్యాప్తు

ప్రధాన అనుమానితుడు.. కేకు పంపించిన శ్రీనును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీను చెబుతున్న సమాధానాలతో సంతృప్తి చెందని పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అతడి కాల్ డాటాను, ఆ రోజు తిరిగిన ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మరెవరైనా ఈ నేరంలో పాలుపంచుకున్నారా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. ఇతర బంధువులను కూడా విచారించారు.

ఫోరెన్సిక్​ నివేదిక వచ్చాకే స్పష్టత

కేకు తయారీ చేసిన బేకరీలోనూ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆరోజు కేకు ఎవరెవరి చేతులు మారింది వారి వివరాలు సేకరిస్తున్నారు. బేకరీలోని కేకు నమూనాలు, మృతుల ఇంట్లో స్వాధీనం చేసుకున్న కేకును ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపారు. వీటితోపాటు పోస్ట్ మార్టంలో సేకరించిన నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షించనున్నారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులకు నేరంపై స్పష్టత రానుంది. వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న భాగ్యలక్ష్మి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమె భర్త, కుమారుడు చనిపోయిన విషయం తెలియకుండా బంధువుల జాగ్రత్త పడుతున్నారు.

ఇవీ చూడండి: పుట్టిన రోజు కేకులో విషం... ఇద్దరు మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.