ETV Bharat / entertainment

'స్క్విడ్‌ గేమ్‌ 2' టీజర్ రిలీజ్ - ఈ కీ పాయింట్స్​ను గమనించారా?

ఆసక్తికరంగా 'స్క్విడ్‌ గేమ్‌ 2' టీజర్‌ - ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు గమనించారా?

Squid Game  2 Teaser
Squid Game 2 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 1 hours ago

Squid Game 2 Teaser : ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా 2021లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న కొరియన్‌ వెబ్‌ సిరీస్‌ 'స్క్విడ్‌ గేమ్‌'. ఇప్పుడు ఈ సిరీస్‌కు కొనసాగింపుగా 'స్క్విడ్‌ గేమ్‌ 2' సిద్ధమవుతోంది. డిసెంబర్‌ 26 నుంచి ఇది స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఈ సీక్వెల్​కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఇక గత సీజన్​లో చూసిన విధంగానే గ్రీన్‌ లైట్‌, రెడ్‌ లైట్‌ వంటి గేమ్స్‌ను మరోసారి ఈ సీజన్‌లోనూ చూడొచ్చుని ఆ వీడియో ద్వారా అర్థమవుతోంది. గత సీజన్‌లో ఈ ఆట నుంచి బయటపడిన 456వ కంటెస్టెంట్ సియోంగ్ గి-హున్ ఇందులో మళ్లీ పాల్గొనడం ఇది ప్రమాదకరం ఇక్కడినుంచి వెళ్లిపోదామంటూ కో ప్లేయర్స్​ను హెచ్చరించడం వంటి సీన్స్ టీజర్​లో కీ హైలైట్స్​గా నిలిచాయి.

ఇంతకీ ఈ 'స్క్విడ్‌ గేమ్‌' స్టోరీ ఏంటంటే:
జీవితంలో సర్వస్వం కోల్పోయి, అప్పులపాలైన ఓ 456 మందిని రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్‌లైట్‌, గ్రీన్‌లైట్‌, టగ్ ఆఫ్‌ వార్‌ వంటి ఆటల పోటీలను నిర్వహిస్తారు. మొత్తం ఆరు గేమ్స్ ఉంటాయి. చివరగా వచ్చేదే​ 'స్క్విడ్‌ గేమ్'. ఈ ఆరు ఆటల్లో విజేతలుగా నిలిచినవారు మాత్రమే భారీ మొత్తంలో డబ్బు గెలుచుకోవచ్చు. కానీ, ఈ గేమ్స్​లో ఓడిపోయిన వారిని ఎలిమినేషన్‌ అనే పేరుతో చంపేస్తుంటారు.

సర్వైవల్‌ థ్రిల్లర్‌గా రూపందిన ఈ సిరీస్‌ కొరియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. చేసుకుంది. రిలీజైన కొద్ది రోజుల్లోనే సుమారు 111 మిలియన్ల వ్యూస్‌తో తెగ ట్రెండ్ అయ్యింది. ఈ క్రమంలో ఈ సిరీస్​ డైరెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.

"స్క్విడ్‌ గేమ్‌కి ప్రాణం పోసి ఓ సిరీస్‌గా మీ ముందుకు తీసుకురావడానికి దాదాపు 12 ఏళ్లు పట్టింది. కానీ, ఎన్నడూ లేనివిధంగా నెట్‌ఫ్లిక్స్‌లో మోస్ట్‌ పాపులర్‌ షోగా 'స్క్విడ్‌ గేమ్‌' పేరు తెచ్చుకోవడానికి కేవలం 12 రోజులు మాత్రమే పట్టింది. ఈ సిరీస్​కు ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు" అని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ మొదటి సీజన్​కు కొనసాగింపుగానే సీక్వెల్ రూపొందుతోంది.

'మా సినిమా కాపీ కొట్టి స్క్విడ్​ గేమ్ తీశారు' : కోర్టుకెక్కిన బాలీవుడ్ డైరెక్టర్ - Squid Game Copy Allegations

'స్క్విడ్​గేమ్' లాంటి అడ్వెంచర్స్​- నెట్​ఫ్లిక్స్​లో ఉన్న టాప్ 10 మూవీస్ ఇవే - Squid Game Type Movies Hollywood

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.