ETV Bharat / state

శ్మశానంలో దివాళీ సంబురాలు - సమాధుల వద్ద మిఠాయిలు - అలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా? - DIWALI IN GRAVEYARD IN KARIMNAGAR

దీపావళి రోజు సమాధుల వద్ద సెలబ్రేషన్స్​ - అర్ధ శతాబ్దం నుంచి కొనసాగుతూ వస్తున్న ఆచారం - కరీంనగర్​లోని కర్మాన్​ఘాట్​లో ఈ వింత సాంప్రదాయం

Diwali Celebrations at Thumbs
Diwali Celebrations at Thumbs (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2024, 10:54 AM IST

Diwali Celebrations at Thumbs : దీపావళి పండుగ రోజు ఎవరైనా లక్ష్మీదేవి పూజ చేస్తారు. ఇంట్లో బాణాసంచా కాలుస్తారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా శ్మశానంలో దీపావళి సంబురాలు జరుపుకుంటారు. ఇదేంటి? వెలుగులు విరజిమ్మే దీపావళి రోజు శ్మశానంలో సంబురాలు చేసుకోవడం ఏంటని ఆశ్చర్యంగా చూస్తున్నారా? అసలు ఆ వింత సాంప్రదాయం ఎక్కడ పాటిస్తున్నారు? అలా ఎందుకు చేస్తారో తెలుసుకోవాలని ఉందా. అయితే ఈ స్టోరీ చదివేయండి.

కరీంనగర్​లోని ఒక సామాజిక వర్గం సమాధుల వద్ద పూజలు చేసి దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ వింత ఆచారం కరీంనగర్​లోని కర్మాన్​ఘాట్​లో దర్శనమిచ్చింది. చనిపోయిన తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటూ వారి సమాధుల వద్ద తిను బండారాలను పెట్టి దీపాలు వెలిగిస్తారు. అనంతరం టపాసులు కాల్చి వేడుకలు చేసుకుంటారు. ఇలా ఈ ఆచారాన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

మెదక్​ జిల్లాలో అర్ధ శతాబ్ధంగా సమాధుల వద్ద దీపావళి : ఇదిలా ఉండగా మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండలం లింగాపూర్ గ్రామంలోనూ ఇలాంటి వింత ఆచారం అర్ధ శతాబ్దం నుంచి కొనసాగుతోందట. చనిపోయిన వారిని స్మరించుకుంటూ దీపావళి రోజు అంతా సమాధుల వద్దకు వెళతారు. అక్కడ నైవేద్యాలు పెట్టి, మతాబులు కాల్చి సంబురాలు చేసుకుంటారు. ఇక్కడ కొన్ని కుటుంబాలు 50 ఏళ్లుగా ఈ వింత సంస్కృతిని ఆనవాయితీ పాటిస్తున్నాయి. దీపావళి రోజున చనిపోయిన వారికి ఇష్టమైన పిండి వంటకాలను ఇంట్లో చేసి, ఎంతో ఇష్టంతో శ్మశానం వద్దకు తీసుకెళతారు.

అక్కడ చనిపోయిన పూర్వీకులకు నైవేధ్యం పెట్టి దీపాలు వెలిగించి సమాధుల వద్ద టపాసులు కాల్చుతారు. వారితో ఉన్న రోజులను గుర్తు చేసుకుంటారు. దీనిపై అక్కడి వారిని అడిగితే ఈ ఆచారం తమ పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. పండుగ రోజు మృతి చెందిన తమ పెద్దలను స్మరించుకుంటూ ఇలా వేడుకలు చేసుకోవడం ఆనందంగా ఉందని కుటుంబసభ్యులు తెలుపుతున్నారు. ఈ ఆచారాలకు ఆకర్షితులైన కొందరు ఇతర గ్రామాల వారు దీపావళి రోజు ఈ గ్రామానికి వచ్చి ఆసక్తిగా చూస్తారట.

26 సమాధుల మధ్య టీ స్టాల్‌.. 60 ఏళ్లుగా వ్యాపారం.. అక్కడ ఛాయ్​ తాగితే ఫుల్​ 'లక్కీ' అంట!

సమాధులు తవ్వి, మృతదేహాలపైకి నీళ్లు పంపింగ్.. కారణం ఇదేనట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.