సిద్దిపేట పురపాలక కార్యాలయంలో బక్రీద్ పండుగ సందర్భంగా పీస్ మీటింగ్ నిర్వహించారు. డీసీపీ నర్సింహారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, వివిద సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. బక్రీద్ పండుగ రోజు సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీసీపీ నర్సింహారెడ్డి తెలిపారు. శాంతియుతంగా పండుగ నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల ఏసీపీ రామేశ్వర్, పురపాలక, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఏపీలో ప్రమాదం.. ఐదుగురు కరీంనగర్ వాసుల మృతి