ETV Bharat / state

కనువిందుగా అంతక్కపేటలోని పల్లె ప్రకృతి వనం - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. సిద్దిపేట జిల్లా అంతక్కపేటలో ఏర్పాటు చేసిన ఈ హరిత వనం చూపరులకు కనువిందు చేస్తోంది. పట్టణాల్లో ఉండే పార్క్​ల మాదిరిగా తమ ఊరిలో దీనిని వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలతో ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు.

palle prakruthi vanam at anthakkapet in siddipet district
కనువిందుగా అంతక్కపేటలోని పల్లె ప్రకృతి వనం
author img

By

Published : Nov 13, 2020, 12:00 PM IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతక్కపేటలోని పల్లె ప్రకృతి వనం ఆకట్టుకుంటోంది. గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలనిస్తుంది. హుస్నాబాద్ నియోజకవర్గంలోనే మొదటిసారిగా అంతక్కపేట గ్రామంలో పల్లె ప్రకృతి వనం పూర్తి కావడం విశేషం. పచ్చని చెట్లతో చూపరులకు కనువిందు చేస్తోంది. గ్రామంలోని ఉన్నత, ప్రాథమిక పాఠశాలల పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఈ వనాన్ని ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు ఇదీ మినీ పార్క్ లాగా ఆహ్లాదకరంగా ఉండేలాగా తీర్చిదిద్దారు.

రాజమహేంద్రవరం నుంచి తెప్పించిన వివిధ రకాల 800 మొక్కలు నాటి... ఆ ప్రాంతాన్ని హరిత మయం చేశారు. ఇటీవల మండలంలో పర్యటించిన కేంద్ర బృందం అంతకపేటలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి... బాగుందని కితాబిచ్చారని సర్పంచ్ ఇర్రి లావణ్య తెలిపారు. 15 రకాల పూలు, పండ్ల మొక్కలను నాటామని, వాటికి రోజూ నీళ్లు పెట్టడానికి ఒక ఉపాధి హామీ కూలీనీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పట్టణాల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడానికి పార్కులు ఏ విధంగా ఉన్నాయో, తమ గ్రామంలోనూ మినీ పార్క్​లాగా ఈ పల్లె ప్రకృతి వనాన్ని తీర్చిదిద్దినట్లు ఆమె వివరించారు.

ఇదీ చదవండి: సుందరంగా ముస్తాబైన భద్రాచలంలోని పల్లె ప్రకృతి వనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.