ETV Bharat / state

ఆన్​లైన్​ తరగతులు.. బాగున్నాయంటున్న పేరెంట్స్​ - dubbaka news

కరోనా వైరస్ వల్ల ఈ విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్​లైన్​ క్లాసులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా విద్యార్థులు టీవీలు, మొబైల్ ఫోన్లలో ఆన్​లైన్​ పాఠాలు వింటున్నారు.

online classes started in dubbaka constiunecy

author img

By

Published : Sep 1, 2020, 5:09 PM IST

ఈరోజు నుంచి ప్రారంభమైన ఆన్​లైన్​ తరగతుల్లో భాగంగా సిద్దిపేట జిల్లాలోని తోగుట, మిరుదొడ్డి, చేగుంట మండలాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు పాఠాలు విన్నారు. ఆన్​లైన్ క్లాసులను టీవీల్లో సంబంధిత ఛానళ్లలో వీక్షించారు. ఆన్​లైన్​ తరగతులు ప్రారంభించటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు... టీవీల్లో క్లాసులు వచ్చే సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని కోరుతున్నారు. తరగతులు అయ్యాక విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే... జూమ్​ యాప్​ ద్వారా ఉపాధ్యాయులను సంప్రదించి పరిష్కరించుకోవచ్చని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సూచించారు.

ఇదీచూడండి.. ' వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగడం సంతోషకరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.