సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తాలో టీఆర్టీ-2017 అభ్యర్థులకు వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు నిరసన చేపట్టాయి. ఈ కార్యక్రమంలో కళ్లకు గంతలు కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధ్యాయ నియామకాలపై ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగాలు కల్పించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు తప్ప ఉద్యోగాలు కల్పించడం లేదని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి ఆరోపించారు.
ఇవీ చూడండి: వాళ్లకో న్యాయం.. మాకో న్యాయమా..?