నూతనంగా అందుబాటులోకి వచ్చిన అంబులెన్స్ సౌకర్యాన్ని అత్యవసర సమయాల్లో వినియోగించుకోవాలని పట్టణ ప్రజలను సిద్దిపేట జిల్లా హూస్నాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ ఆకుల రజిత కోరారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్‌ను వైస్ ఛైర్పర్సన్ అనిత, మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతిరెడ్డితో కలిసి ప్రారంభించారు. అంబులెన్స్ కొరత ఉందని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లగానే స్పందించి మంత్రి... వెంటనే వాహనాన్ని ఇప్పించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు పట్టణ ప్రజల తరఫున ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
తెరాస ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతిరెడ్డి అన్నారు. కావాలంటే మూడు అంబులెన్సులు ఏర్పాటు చేయడానికి మంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకులు రాద్దాంతం చేస్తున్నాయని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: భారత వైద్య విద్యార్థులకు షాక్.. హౌస్ సర్జన్ చేసేందుకు నిరాకరణ