ETV Bharat / state

'వారు ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు'

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగే ఉపఎన్నికల్లో తెరాస భారీ మెజార్టీతో గెలుస్తుందని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య తెలిపారు. ఓట్ల కోసం భాజపా, కాంగ్రెస్​ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

mp badugula lingaiah at miryalguda on dubbaka byelections
'వారు ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు'
author img

By

Published : Oct 29, 2020, 10:47 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య సమావేశం ఏర్పాటు చేశారు. భాజపా, కాంగ్రెస్​లకు దుబ్బాక ఉన్నికల్లో డిపాజిట్లు కూడా రావని... ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. డబ్బు కట్టలతో ప్రత్యక్షంగా పట్టుబడినా తప్పులు సరిదిద్దుకోడానికి భాజపా చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఉపఎన్నికల్లో తెరాస భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పనితీరుకు పట్టం కట్టేందుకు దుబ్బాక ప్రజలు సిద్ధంగా ఉన్నారని లింగయ్య అన్నారు. రెండో స్థానం కోసమే భాజపా, కాంగ్రెస్​లు ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఉత్తమ్​కుమార్​రెడ్డి, రేవంత్​రెడ్డిలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పండిన ప్రతి గింజతో పాటు... అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ధరణి'లో స్లాట్​ బుకింగ్ ఎలా చేయాలో... తెలుసుకుందాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.