సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని రేణుక ఎల్లమ్మ, మరకత లింగేశ్వర స్వామి, పొట్లపల్లిలోని స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయాల్లో స్థానిక ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ఆయన సతీమణి షమితతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కరోనా బారినపడి కోలుకొని దాదాపు మూడు నెలల తర్వాత నియోజకవర్గ కేంద్రంలో ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి: ఆస్తుల నమోదుకు గడువు లేదు... హైకోర్టుకు సర్కారు స్పష్టం