ETV Bharat / state

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ - ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆకలితో అలమటించే నిరుపేదలను ఆదుకునేందుకు మరింత మంది వదాన్యులు ముందుకు రావాలని సూచించారు.

MLA SOLIPETA RAMALINGAREDDY DISTRIBUTES ESSENTIALS CORONA
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ
author img

By

Published : Apr 7, 2020, 9:10 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ ఆర్య వైశ్య భవన్​లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేతుల మీదుగా 300 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇది ఒక మంచి శుభ పరిణామమని, దీనిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చాలా మంది ముందుకు వచ్చి నిరుపేదల ఆకలి తీర్చాలని, పేదలు ఆకలితో అలమటించకుండా ఆదుకోవడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చింత రాజు, దుబ్బాక మున్సిపాలిటీ కౌన్సిలర్లు, సీఐ హరికృష్ణ, ఎస్సై మన్నె స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ

ఇదీ చూడండి: కొవిడ్​ సంక్షోభంలో ప్రధానికి సోనియా 5 సూచనలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.