సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామంలో శ్రీ వేద నాన్ ఓవెన్ బట్ట సంచుల పరిశ్రమను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. 80 లక్షల వ్యయంతో మహిళలు బట్ట సంచుల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయడాన్ని ఎమ్మెల్యే అభినందించారు. బ్యాగుల ఏర్పాటుకు సంబంధించిన యంత్రాలను ప్రారంభించి వాటి పనితీరు, ఉత్పత్తిని పరిశీలించారు.
ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం తగ్గించండి..
పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగం పూర్తిగా తగ్గించాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామీణ పరిశ్రమల ద్వారా స్వయం సమృద్ధితోపాటు పలువురికి ఉపాధి కూడా దొరుకుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం మానివేసి బట్ట సంచులు ఉపయోగించాలని కోరారు. ప్రభుత్వం చిన్న పరిశ్రమల ఏర్పాటుకు సబ్సిడీతో రుణాలు ఇస్తుందని వాటిని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: 'ప్రజాప్రతినిధుల కేసుల విచారణపై గవర్నర్కు లేఖ'