ETV Bharat / state

హుస్నాబాద్​లో పంటమార్పిడిపై అవగాహన సదస్సు - ఎమ్మెల్యే సతీష్​ కుమార్

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్​లో నిర్వహించిన పంట మార్పిడి సదస్సులో ఎమ్మెల్యే సతీష్​ కుమార్ పాల్గొన్నారు. రైతుల బాగు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి తెచ్చిన పథకాలు, చేస్తున్న ప్రణాళికల గురించి అందరికీ ఆర్థమయ్యేలా వివరించారు. తెలంగాణను సస్యశ్యామలం చేసి.. రైతును రాజును చేసేందుకే కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని అన్నారు.

MLA Sathish Kumar Participated In Crop Change Seminar In husnabad
హుస్నాబాద్​లో పంటమార్పిడిపై అవగాహన సదస్సు
author img

By

Published : May 23, 2020, 11:57 PM IST

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్​ నియోజకవర్గంలో నిర్వహించిన పంట మార్పిడి సదస్సులో ఎమ్మెల్యే సతీష్​ కుమార్​ పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.30వేల కోట్లు రైతుల కోసం వెచ్చించి.. వారు పండించిన పంటను కొంటుందని అన్నారు. రైతలు మేలు కోరి.. కేసీఆర్​ పంట మార్పిడి విధానాన్ని సూచిస్తున్నారని తెలిపారు. నిరంతరం రైతుల బాగు కోసం ఆలోచించే నాయకుడు కేసీఆర్​ అని.. రైతుబంధు, సాగునీరు, మద్ధతు ధర వంటి ఎన్నో పనులు చేసిన కేసీఆర్.. రైతులు ఇబ్బందుల పాలయ్యే ఏ పని చేయరని ఆయన నమ్మకాన్ని వెలిబుచ్చారు.

రైతులు పండించిన ప్రతి పంటకు ప్రభుత్వం మద్ధతు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుందని.. అందుకే ఏ పంటలు వేయాలో రైతులకు సూచిస్తుందని అన్నారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తై.. గోదావరి జలాలతో హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

ఇదీ చదవండి: ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.