సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసింది. స్థానిక ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి, క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కానుకలను అందజేశారు.
అన్ని వర్గాల ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా, రంజాన్, క్రిస్మస్ సమయంలో కానుకలను అందిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అన్ని మతస్థుల వారు కలిసికట్టుగా ఉన్నప్పుడే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతున్నారు. హుస్నాబాద్‌లో క్రైస్తవులకు ప్రత్యేక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇవీచూడండి: 'కవిత్వం సమాజానికి చుక్కాని వంటిది'