సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో ఇటీవల మృతి చెందిన అమ్మన లక్ష్మారెడ్డి కుటుంబంలో మానసిక వికలాంగులైన కొడుకు, కూతురుకి ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆర్థికసాయం అందజేశారు. ఇద్దరికీ రూ. లక్షా 50 వేలు చొప్పున రూ. 3 లక్షలు విలువైన చెక్కులను ఆయన అందజేశారు.
అనంతరం తన వంతు సాయంగా రూ. పదివేల నగదును వారి కుటుంబానికి అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు చెల్లాపూర్ వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్ వనిత, జడ్పీటీసీ, ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు.