సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో ఆలయ రాజ గోపురానికి మహాకుంభాభిషేకం పూజ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డిలు హాజరయ్యారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
మల్లికార్జున స్వామి సన్నిధిలో 53లక్షలతో నూతనంగా నిర్మించిన నిత్యాన్నదాన సత్రం, 30లక్షలతో నిర్మించిన 6 గదుల సత్రాన్ని ప్రారంభించారు. మల్లన్న గుట్టపై రోడ్డు నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని అధికారులపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ద్వారాలకు డిసెంబర్లో జరగనున్న మల్లన్న కల్యాణం లోపు వెండి తొడుగులు అమర్చాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: ఉత్సాహంగా 'భారత్-ఖతార్' సాంస్కృతిక వేడుకలు