సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టును మంత్రి హరీశ్ పరిశీలించారు. సొరంగం టన్నెల్‌లోని 12 పంపు హౌస్ పనులను ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి సమీక్షించారు. దుబ్బాక నియోజకవర్గానికి ప్రధాన కాలువ ద్వారా నీళ్లు అందించే.. పంపు హౌస్ దారి పనులను గురించి నీటిపారుదల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఫీడర్ ఛానల్ నుంచి మల్లన్న సాగర్ ప్రధాన కాలువకు చేపట్టాల్సిన పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీశ్ ఆదేశించారు. దుబ్బాకకు మల్లన్నసాగర్ ద్వారా గోదావరి జలాలు రాబోతున్నాయన్నారు. ప్రాజెక్టు ద్వారా 1.25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని హరీశ్ తెలిపారు.
ఇదీ చదవండి: తక్కువ ఖర్చుతో కరోనా చికిత్సకు వెంటిలేటర్