ప్రజలకు జవాబుదారితనం రావాలని, ప్రభుత్వ పారదర్శకత పెరగాలనే కొత్త మున్సిపల్ చట్టం చేయడం జరిగిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రం లాంటిదని అభివర్ణించారు. 'పని చేసే బాధ్యత ప్రజా ప్రతినిధులది.. సహకరించే బాధ్యత ప్రజలందరిది' అని తెలిపారు.
అనంతరం నియోజకవర్గపరిధిలోని 326 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ రోజా శర్మ, అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.