ETV Bharat / state

HARISH RAO: 'దేవాలయాల అభివృద్ధినీ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా భావించాం' - minister harish rao latest news

సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. చినజీయర్ స్వామితో కలిసి మంత్రి హరీశ్​రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

HARISH RAO: 'తెరాస హయాంలో ఆలయాల అభివృద్ధికి నిధులిస్తున్నాం'

author img

By

Published : Aug 20, 2021, 10:57 PM IST

HARISH RAO: 'తెరాస హయాంలో ఆలయాల అభివృద్ధికి నిధులిస్తున్నాం'

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో రూ.10 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం (venkateshwara temple)లో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మొదటి రోజు ఉత్సవ విగ్రహాలను పట్టణంలో ఊరేగించారు. అనంతరం మూడు రోజుల పాటు ఆలయంలో పాలాభిషేకం, కనకాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు. నాలుగో రోజైన నేడు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు, శ్రీ శ్రీ శ్రీ చినజీయర్​ స్వామి, ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రఘునందన్​ రావు ముఖ్య అతిథులుగా హాజరై.. పూజల్లో పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా ఉందో.. దుబ్బాకలోని వెంకటేశ్వర ఆలయం సైతం అదేవిధంగా భక్తి పారవశ్యంతో కనిపిస్తుందని మంత్రి హరీశ్​రావు, చినజీయర్​ స్వామిలు పేర్కొన్నారు. దేవుడు అందరికీ ఒక్కడే అని అన్నారు. దేవాలయాల అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా భావించింది ఒక్క తెరాస సర్కారు మాత్రమేనని స్పష్టం చేశారు. ఆలయాన్ని అన్ని రకాలుగా అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు.

సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా పంట పొలాలతో పచ్చగా కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరవు కాటకాలే దర్శనమిచ్చేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఆలయాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. గత ప్రభుత్వాలు ఆలయాలకు కేటాయించిన నిధులను వేరే విధంగా మళ్లించే వారని ఆరోపించారు. కేసీఆర్​ పాలనలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని హర్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

దేవాలయాల నిధులను గతంలో ప్రభుత్వాలు వాడుకునేవి. ప్రజల అవసరాలకు ఖర్చు చేసేవి. కానీ సీఎం కేసీఆర్​ బాధ్యతలు చేపట్టాక.. దేవాలయాల కోసం పెద్దఎత్తున నిధులు ఖర్చు పెట్టారు. అందుకే కేసీఆర్​కు ఆ భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ధాన్యాగారంగా మారింది. అనేక రకాలుగా అభివృద్ధిలో ఈ రాష్ట్రం ముందుకుపోతుంది. - హరీశ్​రావు, ఆర్థికశాఖ మంత్రి

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆలయాల అభివృద్ధిని కూడా రాష్ట్ర అభివృద్ధిలో ఒక భాగంగా భావించి అభివృద్ధి చేస్తున్నారు. సీఎం కేసీఆర్​ అధికారంలోకి వచ్చాక ఆలయాలకు మహర్దశ వచ్చింది. ఆలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది చాలా సంతోషం. - చినజీయర్​ స్వామి

ఇవీ చూడండి..

Jagadish fire: భాజపా-తెరాస మేనిఫెస్టోపై చర్చకు కిషన్‌ రెడ్డి సిద్ధమా?: జగదీశ్​ రెడ్డి

HARISH RAO: బండి సంజయ్​కి పాలాభిషేకం చేస్తాం.. మంత్రి హరీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.