ETV Bharat / state

రంగనాయక నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి హరీశ్ - project_visit

సిద్దిపేట జిల్లాలో నిర్మించిన శ్రీ రంగనాయక సాగర్ నిర్మాణ పనులను ఆర్థిక మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. మరో రెండు మూడు రోజుల్లో ప్రాజెక్ట్​లోని మోటార్లు వెట్ రన్​కు సిద్ధం కాబోతోందని అధికార వర్గాలు వెల్లడించాయి.

మరో 2 లేదా 3 రోజుల్లో వెట్ రన్
మరో 2 లేదా 3 రోజుల్లో వెట్ రన్
author img

By

Published : Apr 16, 2020, 8:12 PM IST

కాళేశ్వరం ప్రాజెక్ట్​లో భాగంగా సిద్దిపేట శివారులో నిర్మించిన శ్రీ రంగ నాయక సాగర్ నిర్మాణ పనులను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. మరో రెండు మూడు రోజుల్లో వెట్ రన్​కు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో మంత్రి హరీశ్ రావు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. సర్జిపూల్​లోకి వస్తున్న గోదావరి జలాల పంపింగ్ విధానాన్ని, పంప్ హౌస్​లో ప్రారంభానికి సిద్ధమైన 4 మోటారు పంపుల్లో చేపట్టిన, చేపట్టాల్సిన అంశాలపై ఆరా తీశారు. ఈ మేరకు రంగనాయక సాగర్ టన్నెల్​లో వచ్చిన గోదావరి జలాలను చూసి మంత్రి హరీశ్ సంతోషం వ్యక్తం చేశారు.

సిద్ధిపేట ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. ఈ ప్రాంత రైతుల కల సాకారం కాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు మంత్రి. అనంతరం టన్నెల్​లోని కాన్ఫరెన్స్ హాల్​లో నీటిపారుదల శాఖ అధికారులు, నిర్మాణ గుత్తేదారు సిబ్బందితో ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ మేరకు కాళేశ్వరం జలాలు రాక సంబురంతో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రితో సెల్ఫీ ఫోటోలు దిగారు.

ఇవీ చూడండి : లాక్​డౌన్​ ముగిశాక కొత్త రూల్స్​ ఇవే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.