ETV Bharat / state

ఉపఎన్నికల్లో తెరాసను భారీ మెజార్టీతో గెలిపించండి: హరీష్​ రావు - dubbaka

దుబ్బాక ఉపఎన్నికల్లో తెరాసను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి హరీష్​ రావు ప్రజలను కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఆయన పర్యటించి... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం బోరు మోటర్లకు మీటర్లు పెట్టేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు.

minister harish rao visited dubbaka town in siddipet district
ఉపఎన్నికల్లో తెరాసను భారీ మెజార్టీతో గెలిపించండి: హరీష్​ రావు
author img

By

Published : Sep 28, 2020, 5:04 AM IST

అతి త్వరలో దుబ్బాకలోని లక్ష ముప్పై ఎకరాలకు నీళ్లు వస్తాయని ఏడాదికి రెండు పంటలు పండించుకోవచ్చునని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో మంత్రి హరీష్ ​రావు పర్యటించారు. పలు వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు, సామూహిక భవనాలకు, కుల సంఘ భవనాలకు శంకుస్థాపన చేశారు. వార్డుల్లో మంత్రి హరీష్ రావుకు మహిళలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వార్డుల్లో పలు కుల సంఘాలు దుబ్బాక ఉపఎన్నికల్లో తమ ఓట్లు తెరాస పార్టీకే వేస్తామని ఏకగ్రీవం చేసి పత్రాన్ని మంత్రికి అందించారు.

దుబ్బాక ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ తెరాస తరఫున ఏ అభ్యర్థిని నిలబెట్టినా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను మంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వం బోరు మోటర్లకు మీటర్లు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని.. గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబునాయుడు కూడా మోటర్లకు మీటర్లు పెడతామని బొక్క బోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, భాజపా పార్టీ నాయకులు ఎన్నికల సమయంలోనే కనిపిస్తారని ఆయన విమర్శించారు. తెరాస ప్రభుత్వం వచ్చాక రైతులకు ఉచిత విద్యుత్​ ఇస్తోందన్నారు.

ఇవీ చూడండి: పర్యాటక శాఖ అవార్డులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.