Harish Rao visit Siddipet: నీటి వృథాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. తాగునీరు వృథాగా మోరీల్లో పోనివ్వద్దని.. మురికి కాల్వల్లో చెత్త వేయొద్దని కోరారు. సిద్దిపేటలోని 13వ వార్డు బీడీ కాలనీలో పర్యటించిన ఆయన ప్లాస్టిక్ రహిత, చెత్త రహిత సిద్దిపేటకు ప్రజలంతా సహకరించాలని మంత్రి అవగాహన కల్పించారు.
నీటి వృథా అరికట్టండి
harish rao on water: 'అమ్మా మీకు నీటి గోస తీర్చడానికి ఎంత కష్ట పడుతున్నామో తెలుసా? మీకు తెల్వదు అందుకే నీళ్లు వృథా చేస్తున్నారు. మేం కరీంనగర్ మానేరు నుంచి ఇక్కడికి నీళ్లు తెస్తున్నాం. మీరేమో తాగునీరు మోరీల్లోకి వృథాగా వదులుతున్నారు. గిట్లయితే ఎట్ల తల్లీ' అంటూ కాలనీ వాసులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. ఓ ఇంటి వద్ద నల్లా నీరు వృథాగా పోవడాన్ని గుర్తించి నేరుగా ఇంటి యజమానురాలిని పిలిచి ఇలా తాగునీటిని వృథా చేయొద్దని, పైసలు పెట్టి సిద్దిపేట దాకా నీళ్లు తెస్తున్నామని.. మీకు మా బాధ తెలియదని.. తెలిస్తే ఇలా చేయరంటూ హితబోధ చేశారు. నల్లా నీరు పట్టుకున్న వెంటనే దానికి మూత పెడితే సరిపోతుంది కదా తల్లీ అంటూ ఆప్యాయంగా సూచించారు. వృథాగా పోతున్న నల్లాకు మూత పెట్టాలని అక్కడ ఉన్న వారికి సూచనలు చేస్తూ ముందుకు సాగారు.
సీసీ రోడ్లకు శంకుస్థాపన
cc roads in siddipet: పట్టణంలోని 13 వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం వార్డులో పర్యటిస్తూ మోరీల్లో చెత్త, నీటి వృథా, ఆ కాలనీలో చెట్లు నాటడం అంశాల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులో పర్యటిస్తూ సమస్యలు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. 13వ వార్డు బీడీ కాలనీలో పర్యటిస్తున్న క్రమంలో మొక్కలు కనిపించక పోవడంతో స్థానిక నాయకుల తీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశాంతి నగర్ జడ్పీ పాఠశాల నుంచి ఇక్కడి వరకూ ఒక మొక్క లేదని, హరిత హారంలో మొక్కలు నాటాలని సూచించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మళ్లీ ఈ ప్రాంత పర్యటనకు వచ్చేసరికి రోడ్డున ఇరువైపులా మొక్కలు నాటాలని స్థానిక కౌన్సిలర్లకు హరీశ్ రావు సూచించారు.
- ఇవీ చూడండి:
- అత్యాధునిక వైద్య పరికరాలతో మెరుగైన వైద్యం: హరీశ్ రావు
- Harish Rao On Vaccination: వ్యాక్సినేషన్లో రికార్డు.. తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ: మంత్రి
- Minister Harish Rao: 'త్వరలోనే సిద్దిపేటను సీడ్ హబ్‌గా మారుస్తాం'
- Harish Rao on Niti Aayog: 'సామాన్యుడికి సైతం ప్రపంచ స్థాయి వైద్యం.. అందుకే మూడో ర్యాంకు'