ETV Bharat / state

వచ్చే ఏడాదికి స్థలం లేనంతగా మొక్కలు నాటండి: హరీశ్​రావు - minister harish rao review on harithaharam

వచ్చే విడత మొక్కలు నాటేందుకు స్థలం లేనంతగా.. ఆరో విడత హరితహారాన్ని విజయవంతం చేయాలని మంత్రి హరీశ్​రావు అధికారులను ఆదేశించారు.

harish rao
వచ్చే ఏడాదికి స్థలం లేనంతగా మొక్కలు నాటండి: హరీశ్​రావు
author img

By

Published : Jul 1, 2020, 4:25 PM IST

హరితహారంలో ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గం ఆదర్శంగా నిలిచిందని హరీశ్​రావు తెలిపారు. గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. వచ్చే ఏడాది హరితహారానికి స్థలం లేనంతగా ఆరో విడతలోనే మొక్కలు నాటుదామన్నారు. అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు. ఐఓసీ కాన్ఫరెన్స్ హాల్​లో ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

జులై 31లోపు డంప్, గ్రేవ్ యార్డులు పూర్తిచేయాలని.. ఆగస్టు 10 నాటికి రైతు వేదిక నిర్మాణాలు పూర్తిచేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. 33/11కేవీ విద్యుత్ సబ్​స్టేషన్​లో నీరు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఖాళీ స్థలాన్ని ప్రకృతి వనంగా తీర్చిదిద్దాలని విద్యుత్ శాఖ ఎస్ఈ కరుణాకర్​బాబుకు మంత్రి ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. పండ్ల వృక్షాలు, మల్బరీసాగు, ఈత వనాలు పెంచడంపై అవగాహన కల్పించాలని ఎంపీడీవోలను ఆదేశించారు.

ఇవీచూడండి: ఓ ఆచార్యుడు సృష్టించిన వనం.. 10 నెలల్లోనే హరితయజ్ఞం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.