ETV Bharat / state

Harish rao: 'పామాయిల్ తోటల సాగులో సిద్దిపేటను ముందంజలో నిలపాలి'

పామాయిల్ తోటల సాగులో సిద్ధిపేటను రాష్ట్రంలో ముందంజలో నిలపాలని... మంత్రి హరీశ్‌రావు అన్నారు. దాని కోసం అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి రైతులు ముందుకొచ్చేలా చొరవ చూపాలని దిశానిర్దేశం చేశారు. సుడా కార్యాలయంలో వరి వెద సాగు,పామాయిల్ తోటలు పెంపకం సహా పలు అంశాలపై జిల్లాలోని ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

Minister Harish Rao review on cultivation of palm oil plantations in Siddipet district
పామాయిల్ తోటల సాగుపై సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్​రావు సమీక్ష
author img

By

Published : Jun 24, 2021, 7:05 AM IST

స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని రైతులను పామాయిల్‌ సాగు చేసేలా ప్రోత్సహించాలని... మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పామాయిల్ తోటల సాగులో సిద్ధిపేటను రాష్ట్రంలో ముందంజలో నిలపాలని దిశానిర్దేశం చేశారు. సుడా కార్యాలయంలో వరి వెద సాగు,పామాయిల్ తోటలు పెంపకం సహా పలు అంశాలపై జిల్లాలోని ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

సిద్దిపేట జిల్లాలో 50వేల ఎకరాలు లక్ష్యంగా చేసుకుని పామాయిల్​ తోటల సాగు చేపట్టాలన్నారు. తొలిదశలో 5 వేల ఎకరాల్లో సాగు లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఇప్పటికే వెయ్యి ఎకరాలు సాగు లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్తున్న జిల్లా ఉద్యానవన శాఖ అధికారులను మంత్రి అభినందించారు. మల్బరీ తోటల పెంపకాన్ని పోత్సహించాలని ఉద్యానశాఖ అధికారులను హరీశ్‌రావు ఆదేశింంచారు.

ఇదీ చదవండి: నేడు కశ్మీర్ నేతలతో మోదీ కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.