ETV Bharat / state

విద్యాసంస్థల్లో అన్నిరకాల వసతులు కల్పించాలి : హరీశ్​రావు - అధికారులతో మంత్రి హరీశ్​రావు సమీక్ష

రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభానికి అన్ని విధాలుగా సిద్ధం చేయాలని మంత్రి హరీశ్​రావు స్పష్టం చేశారు. పది నెలల తర్వాత పాఠశాలలు ప్రారంభిస్తున్నందున అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతుల నిర్వహణ చేపట్టాలని ఆయన తెలిపారు. ఈ రోజు సిద్దిపేటలో నిర్వహించిన జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

minister harish rao review meeting in siddipet on opening precautions in educational institutions
విద్యాసంస్థలను సిద్ధం చేయాలని మంత్రి హరీశ్​రావు ఆదేశం
author img

By

Published : Jan 21, 2021, 9:18 PM IST

పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి వారిలో విశ్వాసం కల్పించాలని మంత్రి హరీశ్​ రావు అన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతుల నిర్వహణ చేపట్టాలని సూచించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9,10, ఇంటర్, డిగ్రీ తరగతులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు సిద్దిపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

కొవిడ్‌ తర్వాత దాదాపు 11 నెలల అనంతరం విద్యాసంస్థలు తెరవబోతున్నాం. వచ్చే నెల 1వ తేదీ నుంచి 9 ఆపైన తరగతుల విద్యార్థులకు ప్రారంభించనున్నాం. విద్యాసంస్థలను వారం రోజుల్లో శుభ్రం చేసి సాధారణ స్థితికి తీసుకురావాలి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. దీనికోసం అధికారులు చొరవ తీసుకోవాలి. తరగతి గదులు, తాగునీటి వసతి, పారిశుద్ధ్యం, శౌచాలయాల పనులు ఈనెల 31లోపు పూర్తి చేయాలి. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో బోధనకు అనువైన వాతావరణం కల్పించాలి.- హరీశ్​రావు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి :

సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభమవుతున్న పాఠశాలల్లో తప్పనిసరిగా శానిటైజేషన్‌ చేయాలని మంత్రి ఆదేశించారు. స్కూళ్లు, హాస్టళ్లల్లో ఉన్న వస్తువులను పరిశీలించిన తర్వాతనే వినియోగించాలని సూచించారు. ప్రధానంగా పరిసరాలు, తాగునీరు, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణకు ఉపాధి హామీ కూలీలను, పంచాయతీ సిబ్బందిని వినియోగించుకోవాలని వెల్లడించారు. మూడు రోజుల ముందే అన్ని పాఠశాలలకు సన్నబియ్యం అందేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

బృందాలుగా ఏర్పడి పరిశీలించండి:

మధ్యాహ్న భోజనం వండేందుకు ఏజెన్సీలు ముందుకు రాకుంటే హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా అందజేయాలని పేర్కొన్నారు. గురుకులాల్లో గతంలో ఉన్న కాంట్రాక్టర్లనే కొనసాగించాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే ఏంఈవోలు, మండల ప్రత్యేకాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు తప్పనిసరిగా థర్మల్‌ స్క్రీనింగ్​‌ నిర్వహించాలని ఆదేశించారు. మండల స్థాయిలో ఎంపీడీవో, ఎంఈవో, ఎంపీపీ, తహసీల్దారు, మండల ప్రత్యేకాధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి.. నాలుగైదు పాఠశాలలను క్షుణ్ణంగా పరిశీలించి పారిశుద్ధ్య పనులు చేయించాలని మంత్రి హరీశ్​రావు సూచించారు.

ఇదీ చూడండి : విబేధాలు వీడండి.. పార్టీని గెలిపించండి : కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.